نوح

تفسير سورة نوح

الترجمة التلجوية

తెలుగు

الترجمة التلجوية

ترجمة معاني القرآن الكريم للغة التلغو ترجمها مولانا عبد الرحيم بن محمد، نشرها مجمع الملك فهد لطباعة المصحف الشريف بالمدينة المنورة، عام الطبعة 1434هـ،

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ إِنَّا أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ أَنْ أَنْذِرْ قَوْمَكَ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ﴾

నిశ్చయంగా, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు: "వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే వారిని హెచ్చరించు!" అని (ఆజ్ఞాపించి) పంపాము.

﴿قَالَ يَا قَوْمِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُبِينٌ﴾

అతను వారితో ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, నేను మీకు స్పష్టంగా హెచ్చరిక చేయటానికి వచ్చిన వాడిని!

﴿أَنِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ وَأَطِيعُونِ﴾

కావున మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

﴿يَغْفِرْ لَكُمْ مِنْ ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنْتُمْ تَعْلَمُونَ﴾

అలా చేస్తే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఒక నియమిత కాలం వరకు మిమ్మల్ని వదలి పెడ్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ నిర్ణయించిన కాలం వచ్చినపుడు, దానిని తప్పించడం సాధ్యం కాదు. ఇది మీరు తెలుసుకుంటే ఎంత బాగుండేది!"

﴿قَالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمِي لَيْلًا وَنَهَارًا﴾

అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా జాతివారిని రేయింబవళ్ళు పిలిచాను;

﴿فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا﴾

కాని, నా పిలుపు, వారి పలాయనాన్ని మాత్రమే హెచ్చించింది.

﴿وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا﴾

మరియు వాస్తవానికి, నేను వారిని, నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు తమ చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు మరియు తమ వస్త్రాలను తమపై కప్పుకునేవారు మరియు వారు మొండి వైఖరి అవలంబిస్తూ దురహంకారంలో మునిగి ఉండేవారు.

﴿ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهَارًا﴾

తరువాత వాస్తవానికి, నేను వారిని ఎలుగెత్తి పిలిచాను.

﴿ثُمَّ إِنِّي أَعْلَنْتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا﴾

ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా పిలిచాను.

﴿فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا﴾

ఇంకా వారితో ఇలా అన్నాను: 'మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు!

﴿يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُمْ مِدْرَارًا﴾

ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు.

﴿وَيُمْدِدْكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَلْ لَكُمْ جَنَّاتٍ وَيَجْعَلْ لَكُمْ أَنْهَارًا﴾

మరియు మీకు ధన సంపదలలోను మరియు సంతానంలోను వృద్ధి నొసంగుతాడు మరియు మీ కొరకు తోటలను ఉత్పత్తి చేస్తాడు. మరియు నదులను ప్రవహింపజేస్తాడు.'"

﴿مَا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا﴾

మీకేమయింది? మీరు అల్లాహ్ మహత్త్వమును ఎందుకు ఆదరించరు?

﴿وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا﴾

మరియు వాస్తవానికి ఆయనే మిమ్మల్ని విభిన్న దశలలో సృష్టించాడు.

﴿أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا﴾

ఏమీ? మీరు చూడటం లేదా? అల్లాహ్ ఏడు ఆకాశాలను ఏ విధంగా అంతస్తులలో సృష్టించాడో!

﴿وَجَعَلَ الْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ الشَّمْسَ سِرَاجًا﴾

మరియు వాటి మధ్య చంద్రుణ్ణి (ప్రతిబింబించే) కాంతిగాను మరియు సూర్యుణ్ణి (వెలిగే) దీపం గాను చేశాడు!

﴿وَاللَّهُ أَنْبَتَكُمْ مِنَ الْأَرْضِ نَبَاتًا﴾

మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి ఉత్పత్తి చేశాడు!

﴿ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا﴾

తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు!

﴿وَاللَّهُ جَعَلَ لَكُمُ الْأَرْضَ بِسَاطًا﴾

మరియు అల్లాహ్ యే మీ కొరకు భూమిని విస్తరింపజేశాడు.

﴿لِتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا﴾

మీరు దానిపై నున్న విశాలమైన మార్గాలలో నడవటానికి.

﴿قَالَ نُوحٌ رَبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَنْ لَمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا﴾

నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమీ అధికం చేయదో!

﴿وَمَكَرُوا مَكْرًا كُبَّارًا﴾

మరియు వారు పెద్ద కుట్ర పన్నారు.

﴿وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا﴾

మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: 'మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్ మరియు సువాఅ; యగూస్, యఊఖ్ మరియు నస్ర్ లను విడిచిపెట్టకండి!'

﴿وَقَدْ أَضَلُّوا كَثِيرًا ۖ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا ضَلَالًا﴾

మరియు వాస్తవానికి, వారు చాలా మందిని తప్పు దారిలో పడవేశారు. కావున (ఓ నా ప్రభూ!) : నీవు కూడా ఈ దుర్మార్గులకు కేవలం వారి మార్గభ్రష్టత్వాన్నే హెచ్చించు!''"

﴿مِمَّا خَطِيئَاتِهِمْ أُغْرِقُوا فَأُدْخِلُوا نَارًا فَلَمْ يَجِدُوا لَهُمْ مِنْ دُونِ اللَّهِ أَنْصَارًا﴾

వారు తమ పాపాల కారణంగా ముంచి వేయబడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్ తప్ప తమను కాపాడే వారినెవ్వరినీ పొందలేక పోయారు.

﴿وَقَالَ نُوحٌ رَبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا﴾

మరియు నూహ్ ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! సత్యతిరస్కారులలో ఒక్కరిని కూడా భూమి మీద వదలకు.

﴿إِنَّكَ إِنْ تَذَرْهُمْ يُضِلُّوا عِبَادَكَ وَلَا يَلِدُوا إِلَّا فَاجِرًا كَفَّارًا﴾

ఒకవేళ నీవు వారిని వదలి పెడితే, నిశ్చయంగా వారు నీ దాసులను మార్గభ్రష్టత్వంలో పడవేస్తారు. మరియు వారు పాపులను మరియు కృతఘ్నులను మాత్రమే పుట్టిస్తారు.

﴿رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَنْ دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا تَبَارًا﴾

ఓ మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వానిని మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను, అందరినీ క్షమించు. మరియు దుర్మార్గులకు వినాశం తప్ప మరేమీ అధికం చేయకు!"

الترجمات والتفاسير لهذه السورة: