الأعراف

تفسير سورة الأعراف

الترجمة التلجوية

తెలుగు

الترجمة التلجوية

ترجمة معاني القرآن الكريم للغة التلغو ترجمها مولانا عبد الرحيم بن محمد، نشرها مجمع الملك فهد لطباعة المصحف الشريف بالمدينة المنورة، عام الطبعة 1434هـ،

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ المص﴾

అలిఫ్ - లామ్ - మీమ్ - సాద్!

﴿كِتَابٌ أُنْزِلَ إِلَيْكَ فَلَا يَكُنْ فِي صَدْرِكَ حَرَجٌ مِنْهُ لِتُنْذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ﴾

(ఓ ముహమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింప జేయబడింది.
కావున దీనిని గురించి నీ హృదయంలో ఏ విధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పేవారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింపజేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం.

﴿اتَّبِعُوا مَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِنْ دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَا تَذَكَّرُونَ﴾

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు!

﴿وَكَمْ مِنْ قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ﴾

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము.
వారిపై, మా శిక్ష (ఆకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది.

﴿فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُمْ بَأْسُنَا إِلَّا أَنْ قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ﴾

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: "నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని అనడం తప్ప మరేమీ లేకుండింది!

﴿فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ﴾

కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో, వారిని తప్పక ప్రశ్నిస్తాము. మరియు నిశ్చయంగా, ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము.

﴿فَلَنَقُصَّنَّ عَلَيْهِمْ بِعِلْمٍ ۖ وَمَا كُنَّا غَائِبِينَ﴾

అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే, మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము.

﴿وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَنْ ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ﴾

మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు.

﴿وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ﴾

మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తుకున్నవారు. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు.

﴿وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَا تَشْكُرُونَ﴾

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము. మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము (అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ.

﴿وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُنْ مِنَ السَّاجِدِينَ﴾

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము. పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము.
ఆ పిదప దైవదూతలను: "మీరు ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి!" అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు.

﴿قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ ۖ قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ﴾

(అప్పుడు అల్లాహ్) అన్నాడు: "(ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి?" దానికి (ఇబ్లీస్): "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు." అని జవాబిచ్చాడు.

﴿قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُونُ لَكَ أَنْ تَتَكَبَّرَ فِيهَا فَاخْرُجْ إِنَّكَ مِنَ الصَّاغِرِينَ﴾

(అప్పుడు అల్లాహ్) ఆజ్ఞాపించాడు: "నీవిక్కడ నుండి దిగిపో! ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో! నిశ్చయంగా, నీవు నీచులలో చేరావు!"

﴿قَالَ أَنْظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ﴾

(ఇబ్లీస్) ఇలా వేడుకున్నాడు: "వారు తిరిగి లేపబడే (పునరుత్థాన) దినం వరకు నాకు వ్యవధినివ్వు!"

﴿قَالَ إِنَّكَ مِنَ الْمُنْظَرِينَ﴾

(అల్లాహ్) సెలవిచ్చాడు: "నిశ్చయంగా, నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!"

﴿قَالَ فَبِمَا أَغْوَيْتَنِي لَأَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيمَ﴾

(దానికి ఇబ్లీస్) అన్నాడు: "నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు, నేను కూడా వారి కొరకు నీ ఋజుమార్గంపై మాటువేసి కూర్చుంటాను!"

﴿ثُمَّ لَآتِيَنَّهُمْ مِنْ بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ أَيْمَانِهِمْ وَعَنْ شَمَائِلِهِمْ ۖ وَلَا تَجِدُ أَكْثَرَهُمْ شَاكِرِينَ﴾

"తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమ వైపు నుండి, వారి వైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు!"

﴿قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُومًا مَدْحُورًا ۖ لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكُمْ أَجْمَعِينَ﴾

(అల్లాహ్) జవాబిచ్చాడు, "నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను."

﴿وَيَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ﴾

మరియు : "ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని (ఫలాలను) తినండి. కాని ఈ వృక్షాన్ని సమీపించకండి! అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరి పోతారు."

﴿فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ لِيُبْدِيَ لَهُمَا مَا وُورِيَ عَنْهُمَا مِنْ سَوْآتِهِمَا وَقَالَ مَا نَهَاكُمَا رَبُّكُمَا عَنْ هَٰذِهِ الشَّجَرَةِ إِلَّا أَنْ تَكُونَا مَلَكَيْنِ أَوْ تَكُونَا مِنَ الْخَالِدِينَ﴾

ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు: "మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు, మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు!"

﴿وَقَاسَمَهُمَا إِنِّي لَكُمَا لَمِنَ النَّاصِحِينَ﴾

మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: "నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని!"

﴿فَدَلَّاهُمَا بِغُرُورٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِنْ وَرَقِ الْجَنَّةِ ۖ وَنَادَاهُمَا رَبُّهُمَا أَلَمْ أَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَأَقُلْ لَكُمَا إِنَّ الشَّيْطَانَ لَكُمَا عَدُوٌّ مُبِينٌ﴾

ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ (శరీరాల)పై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు.
మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: "ఏమీ? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా?"

﴿قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ﴾

వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: "మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము."

﴿قَالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ﴾

(అల్లాహ్) అన్నాడు: "మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి."

﴿قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ﴾

ఇంకా ఇలా అన్నాడు: "మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పురుత్థరింపబడతారు)."

﴿يَا بَنِي آدَمَ قَدْ أَنْزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا ۖ وَلِبَاسُ التَّقْوَىٰ ذَٰلِكَ خَيْرٌ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ﴾

ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నింటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని, (వీటిని మీకు వినిపిస్తున్నాము).

﴿يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُمْ مِنَ الْجَنَّةِ يَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا ۗ إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ۗ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاءَ لِلَّذِينَ لَا يُؤْمِنُونَ﴾

ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నాకు) గురిచేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము.

﴿وَإِذَا فَعَلُوا فَاحِشَةً قَالُوا وَجَدْنَا عَلَيْهَا آبَاءَنَا وَاللَّهُ أَمَرَنَا بِهَا ۗ قُلْ إِنَّ اللَّهَ لَا يَأْمُرُ بِالْفَحْشَاءِ ۖ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ﴾

మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీలమైన పని చేసినపుడు ఇలా అంటారు: "మేము మా తండ్రితాతలను ఈ పద్ధతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్ యే మమ్మల్ని ఆదేశించాడు." వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమీ? మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్ పై నిందలు వేస్తున్నారా?"

﴿قُلْ أَمَرَ رَبِّي بِالْقِسْطِ ۖ وَأَقِيمُوا وُجُوهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۚ كَمَا بَدَأَكُمْ تَعُودُونَ﴾

(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: "నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు.
మరియు మీరు ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ ముఖాలను సరిగ్గా (ఆయన వైపునకే) మరల్చుకొని నమాజ్ ను పూర్తి శ్రద్ధతో నిర్వహించండి మరియు ధర్మాన్ని / ఆరాధనను (దీన్ ను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి." ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లు మీరు తిరిగి సృష్టించబడతారు.

﴿فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيْهِمُ الضَّلَالَةُ ۗ إِنَّهُمُ اتَّخَذُوا الشَّيَاطِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ اللَّهِ وَيَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ﴾

మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు.
ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు.

﴿۞ يَا بَنِي آدَمَ خُذُوا زِينَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ﴾

ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కాని మితిమీరకండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు.

﴿قُلْ مَنْ حَرَّمَ زِينَةَ اللَّهِ الَّتِي أَخْرَجَ لِعِبَادِهِ وَالطَّيِّبَاتِ مِنَ الرِّزْقِ ۚ قُلْ هِيَ لِلَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا خَالِصَةً يَوْمَ الْقِيَامَةِ ۗ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ﴾

ఇలా అను: "అల్లాహ్ తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?" (ఇంకా) ఇలా అను: "ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థాన దినమున ప్రత్యకంగా వారి కొరకు మాత్రమే గలవు. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గల వారికి స్పష్టంగా వివరిస్తున్నాము."

﴿قُلْ إِنَّمَا حَرَّمَ رَبِّيَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْإِثْمَ وَالْبَغْيَ بِغَيْرِ الْحَقِّ وَأَنْ تُشْرِكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ﴾

ఇలా అను: "నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు."

﴿وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ﴾

మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.

﴿يَا بَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي ۙ فَمَنِ اتَّقَىٰ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ﴾

ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగి వుండి తమను తాము సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

﴿وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ﴾

కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దరహంకారం చూపుతారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

﴿فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ أُولَٰئِكَ يَنَالُهُمْ نَصِيبُهُمْ مِنَ الْكِتَابِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنْتُمْ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنْفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ﴾

ఇక అల్లాహ్ పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వాని కంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు.
తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: "మీరు అల్లాహ్ ను వదలి ప్రార్థించేవారు (ఆ దైవాలు) ఇపుడు ఎక్కడున్నారు?" అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: "వారు మమ్మల్ని వదిలి పోయారు." మరియు ఈ విధంగా వారు: "మేము నిజంగానే సత్యతిరస్కారులమై ఉండేవారము." అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు.

﴿قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ فِي النَّارِ ۖ كُلَّمَا دَخَلَتْ أُمَّةٌ لَعَنَتْ أُخْتَهَا ۖ حَتَّىٰ إِذَا ادَّارَكُوا فِيهَا جَمِيعًا قَالَتْ أُخْرَاهُمْ لِأُولَاهُمْ رَبَّنَا هَٰؤُلَاءِ أَضَلُّونَا فَآتِهِمْ عَذَابًا ضِعْفًا مِنَ النَّارِ ۖ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَلَٰكِنْ لَا تَعْلَمُونَ﴾

(అల్లాహ్) అంటాడు: "మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి." ప్రతి సమాజం (నరకంలో) ప్రవేశించినపుడు తన పూర్వపు వారిని (సమాజాన్ని) శపిస్తుంది.
తుదకు వారంతా అక్కడ చేరిన పిదప; తరువాత వచ్చిన వారు తమ కంటే ముందు వచ్చని వారిని గురించి: "ఓ మా ప్రభూ! వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్ష విధించు!" అని అంటారు. దానికి (అల్లాహ్): "ప్రతి వాడికి రెట్టింపు (శిక్ష) విధించబడుతుంది. కాని మీరది తెలుసుకోలేరు!" అని అంటాడు.

﴿وَقَالَتْ أُولَاهُمْ لِأُخْرَاهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُونَ﴾

మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో: "మీకు మాపై ఎలాంటి ఆధిక్యకత లేదు కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవి చూడండి!" అని అంటారు.

﴿إِنَّ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُجْرِمِينَ﴾

నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు మరియు వాటి పట్ల దురహంకారం చూపిన వారి కొరకు ఆకాశ ద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరి పోగలిగేవరకు వారు స్వర్గంలో ప్రవేశించజాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము.

﴿لَهُمْ مِنْ جَهَنَّمَ مِهَادٌ وَمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ﴾

నరకమే వారి పాన్పు మరియు వారి దుప్పటి అవుతుంది. మరియు ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలమిస్తాము.

﴿وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ﴾

కాని, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వ్యక్తికి, మేము అతని శక్తికి మించిన భారం వేయము. ఇటువంటి వారే స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

﴿وَنَزَعْنَا مَا فِي صُدُورِهِمْ مِنْ غِلٍّ تَجْرِي مِنْ تَحْتِهِمُ الْأَنْهَارُ ۖ وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا أَنْ هَدَانَا اللَّهُ ۖ لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۖ وَنُودُوا أَنْ تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ﴾

మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: "మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారమ కాదు.
మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!" అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: "మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!"

﴿وَنَادَىٰ أَصْحَابُ الْجَنَّةِ أَصْحَابَ النَّارِ أَنْ قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُمْ مَا وَعَدَ رَبُّكُمْ حَقًّا ۖ قَالُوا نَعَمْ ۚ فَأَذَّنَ مُؤَذِّنٌ بَيْنَهُمْ أَنْ لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ﴾

మరియు స్వర్గవాసులు, నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు: "మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా, సత్యమైనదిగా పొందాము.
ఏమీ? మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా? వారు జవాబిస్తారు: "అవును!" అప్పుడు ప్రకటించే వాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: "దుర్మార్గులపై అల్లాహ్ శాపం (బహిష్కారం) ఉంది!"

﴿الَّذِينَ يَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُمْ بِالْآخِرَةِ كَافِرُونَ﴾

ఎవరైతే (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో! అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించినవారు.

﴿وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى الْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّا بِسِيمَاهُمْ ۚ وَنَادَوْا أَصْحَابَ الْجَنَّةِ أَنْ سَلَامٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ﴾

మరియు ఆ ఉభయ వర్గాల మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది. దాని ఎత్తైన ప్రదేశాల మీద కొందరు ప్రజలు ఉంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి గుర్తులను బట్టి తెలుసుకుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించలేదు, కాని దానిని ఆశిస్తున్నారు.

﴿۞ وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ﴾

మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు!"

﴿وَنَادَىٰ أَصْحَابُ الْأَعْرَافِ رِجَالًا يَعْرِفُونَهُمْ بِسِيمَاهُمْ قَالُوا مَا أَغْنَىٰ عَنْكُمْ جَمْعُكُمْ وَمَا كُنْتُمْ تَسْتَكْبِرُونَ﴾

మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: "మీరు కూడ బెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు, మీకు ఏమైనా లాభం చేకూర్చాయా?

﴿أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنْتُمْ تَحْزَنُونَ﴾

" 'వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.
' అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): 'మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా!' "

﴿وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ﴾

మరియు నరకవాసులు స్వర్గవాసులతో: "కొద్ది నీళ్ళో లేక అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపుకు విసరండి." అని అంటారు. (దానికి స్వర్గవాసులు): "నిశ్చయంగా అల్లాహ్! ఈ రెండింటినీ సత్యతిరస్కారులకు నిషేధించి వున్నాడు." అని అంటారు.

﴿الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنْسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَٰذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ﴾

వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది.
(అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "వారు ఈనాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈనాడు మేమూ వారిని మరచిపోతాము!"

﴿وَلَقَدْ جِئْنَاهُمْ بِكِتَابٍ فَصَّلْنَاهُ عَلَىٰ عِلْمٍ هُدًى وَرَحْمَةً لِقَوْمٍ يُؤْمِنُونَ﴾

మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించి ఉన్నాము. అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని, మరియు కారుణ్యం.

﴿هَلْ يَنْظُرُونَ إِلَّا تَأْوِيلَهُ ۚ يَوْمَ يَأْتِي تَأْوِيلُهُ يَقُولُ الَّذِينَ نَسُوهُ مِنْ قَبْلُ قَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ فَهَلْ لَنَا مِنْ شُفَعَاءَ فَيَشْفَعُوا لَنَا أَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ قَدْ خَسِرُوا أَنْفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ﴾

ఏమీ? వారు (అవిశ్వాసులు) దాని తుది ఫలితం సంభవించాలని నిరీక్షిస్తున్నారా? దాని తుది ఫలితం సంభవించే దినమున, దానిని నిర్లక్ష్యం చేసినవారు: "వాస్తవానికి మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తెచ్చారు.
అయితే ఏమీ? మా కొరకు సిఫారసు చేయటానికి, సిఫారసుదారులు ఎవరైనా ఉన్నారా? లేదా మేము మళ్ళీ తిరిగి (భూలోకంలోకి) పంపబడితే మేమింత వరకు చేసిన కర్మలకు విరుద్ధంగా చేసేవారం కదా?" అని పలుకుతారు.
వాస్తవానికి వారు తమకు తాము నష్టం కలిగించుకున్నారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని త్యజించి ఉంటాయి.

﴿إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ﴾

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!

﴿ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ﴾

మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన హద్దులు మీరే వారిని ప్రేమించడు.

﴿وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا وَادْعُوهُ خَوْفًا وَطَمَعًا ۚ إِنَّ رَحْمَتَ اللَّهِ قَرِيبٌ مِنَ الْمُحْسِنِينَ﴾

మరియు భూమిలో సంస్కరణ జరిగిన పిదప దానిలో కల్లోలాన్ని రేకెత్తించకండి మరియు భయంతో మరియు ఆశతో ఆయనను ప్రార్థించండి. నిశ్చయంగా, అల్లాహ్ కారణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది.

﴿وَهُوَ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۖ حَتَّىٰ إِذَا أَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنَاهُ لِبَلَدٍ مَيِّتٍ فَأَنْزَلْنَا بِهِ الْمَاءَ فَأَخْرَجْنَا بِهِ مِنْ كُلِّ الثَّمَرَاتِ ۚ كَذَٰلِكَ نُخْرِجُ الْمَوْتَىٰ لَعَلَّكُمْ تَذَكَّرُونَ﴾

మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు.
ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకొని వస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకొని పోయి వాటి నుండి నీటిని కురిపిస్తాము. ఆ నీటి వలన పలు విధాలైన ఫలాలను ఉత్పత్తి చేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము; ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని!

﴿وَالْبَلَدُ الطَّيِّبُ يَخْرُجُ نَبَاتُهُ بِإِذْنِ رَبِّهِ ۖ وَالَّذِي خَبُثَ لَا يَخْرُجُ إِلَّا نَكِدًا ۚ كَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ لِقَوْمٍ يَشْكُرُونَ﴾

మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంటనిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) నుండి నాసిరకం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపేవారికి మా సూచనలను వివరిస్తాము.

﴿لَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ﴾

వాస్తవంగా, మేము నూహ్ ను అతని జాతివారి వద్దకు పంపాము. అతను వారితో: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను." అని అన్నాడు.

﴿قَالَ الْمَلَأُ مِنْ قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي ضَلَالٍ مُبِينٍ﴾

అతని జాతి నాయకులు అన్నారు: "నిశ్చయంగా, మేము నిన్ను స్పష్టమైన తప్పు దారిలో చూస్తున్నాము!"

﴿قَالَ يَا قَوْمِ لَيْسَ بِي ضَلَالَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ﴾

దానికి (నూహ్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! నాలో ఏ తప్పిదం లేదు. మరియు వాస్తవానికి నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను.

﴿أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنْصَحُ لَكُمْ وَأَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ﴾

నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను మరియు (ధర్మ) బోధన చేస్తున్నాను. ఎందుకంటే! మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరఫు నుండి నాకు తెలుస్తున్నాయి.

﴿أَوَعَجِبْتُمْ أَنْ جَاءَكُمْ ذِكْرٌ مِنْ رَبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِنْكُمْ لِيُنْذِرَكُمْ وَلِتَتَّقُوا وَلَعَلَّكُمْ تُرْحَمُونَ﴾

మీలోని ఒక పురుషుని ద్వారా - దైవభీతి కలిగి ఉంటే, మీరు కరుణింపబడతారని - మిమ్మల్ని హెచ్చరించటానికి, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు జ్ఞాపిక వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా?"

﴿فَكَذَّبُوهُ فَأَنْجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ فِي الْفُلْكِ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا عَمِينَ﴾

అయినా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని కాపాడాము. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన వారిని ముంచి వేశాము. నిశ్చయంగా, వారు గుడ్డిగా ప్రవర్తించిన జనం.

﴿۞ وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ﴾

ఇంకా మేము ఆద్ (జాతి) వద్దకు వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను: "ఓ నా జాతి సోదరులారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొకు ఆరాధ్య దైవుడు లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా ?" అని అన్నాడు.

﴿قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ﴾

అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "మేము, నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా,నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము!"

﴿قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ﴾

(హూద్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! నాలో ఏ మూఢత్వం లేదు. మరియు నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!

﴿أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ﴾

"నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను.

﴿أَوَعَجِبْتُمْ أَنْ جَاءَكُمْ ذِكْرٌ مِنْ رَبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِنْكُمْ لِيُنْذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ﴾

లేదా ! మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం - మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!"

﴿قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ﴾

వారన్నారు: "మేము అల్లాహ్ ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రితాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా!"

﴿قَالَ قَدْ وَقَعَ عَلَيْكُمْ مِنْ رَبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا نَزَّلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ فَانْتَظِرُوا إِنِّي مَعَكُمْ مِنَ الْمُنْتَظِرِينَ﴾

(హూద్) అన్నాడు: "వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి, అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా - మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో - నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను!"

﴿فَأَنْجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ﴾

కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.

﴿وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ ۖ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً ۖ فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ ۖ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ﴾

ఇక సమూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను పంపాము. అతను వారితో! "నా జాతి సోదరులారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఒంటె. కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టిండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. ఆలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది.

﴿وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِنْ سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ الْجِبَالَ بُيُوتًا ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ﴾

"మరియు ఆయన, ఆద్ జాతి వారి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరచిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకున్నారు. మరియు కొండలను తొలచి గృహాలను నిర్మించుకుంటున్నారు. కావున అల్లాహ్ అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు భూమిపై అనర్థాన్ని, కల్లోల్లాన్ని రేకెత్తించకండి!" అని అన్నాడు.

﴿قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِنْ قَوْمِهِ لِلَّذِينَ اسْتُضْعِفُوا لِمَنْ آمَنَ مِنْهُمْ أَتَعْلَمُونَ أَنَّ صَالِحًا مُرْسَلٌ مِنْ رَبِّهِ ۚ قَالُوا إِنَّا بِمَا أُرْسِلَ بِهِ مُؤْمِنُونَ﴾

(సాలిహ్) జాతి వారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: "సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిశ్చయంగా తెలుసా? దానికి వారు: "మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందేశాన్ని విశ్వసిస్తున్నాము." అని జవాబిచ్చారు.

﴿قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا بِالَّذِي آمَنْتُمْ بِهِ كَافِرُونَ﴾

ఆ అహంకారులన్నారు: "మీరు విశ్వసించిన దానిని మేము నిశ్చయంగా తిరస్కరిస్తున్నాము!"

﴿فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا يَا صَالِحُ ائْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِينَ﴾

ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: "ఓ సాలిహ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా!"

﴿فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ﴾

అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు.

﴿فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّي وَنَصَحْتُ لَكُمْ وَلَٰكِنْ لَا تُحِبُّونَ النَّاصِحِينَ﴾

పిదప అతను (సాలిహ్) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా, నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చే వారంటే ఇష్టపడలేదు!"

﴿وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ أَحَدٍ مِنَ الْعَالَمِينَ﴾

ఇత లూత్! అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.

﴿إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِنْ دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنْتُمْ قَوْمٌ مُسْرِفُونَ﴾

"వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

﴿وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَنْ قَالُوا أَخْرِجُوهُمْ مِنْ قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ﴾

కాని అతని జాతి వారి జవాబు కేవలం ఇలాగే ఉండింది: "వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు!"

﴿فَأَنْجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ﴾

ఆ పిదప మేము అతనినీ మరియు అతని ఇంటివారినీ - అతని భార్యను తప్ప - రక్షించాము. ఆమె వెనుక ఉండిపోయిన వారిలో చేరిపోయింది.

﴿وَأَمْطَرْنَا عَلَيْهِمْ مَطَرًا ۖ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ﴾

మరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. చూడండి! ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో!

﴿وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ ۖ فَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ﴾

మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము). అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులో అయితే, ఇదే మీకు మేలైనది.

﴿وَلَا تَقْعُدُوا بِكُلِّ صِرَاطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ بِهِ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَاذْكُرُوا إِذْ كُنْتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَانْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ﴾

మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి.

﴿وَإِنْ كَانَ طَائِفَةٌ مِنْكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّىٰ يَحْكُمَ اللَّهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ﴾

మరియు నా ద్వారా పంపబడిన దానిని (సందేశాన్ని) మీలో ఒక వర్గం వారు విశ్వసించి, మరొక వర్గం వారు విశ్వసించకపోతే! అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకూ సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి!"

﴿۞ قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِنْ قَوْمِهِ لَنُخْرِجَنَّكَ يَا شُعَيْبُ وَالَّذِينَ آمَنُوا مَعَكَ مِنْ قَرْيَتِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۚ قَالَ أَوَلَوْ كُنَّا كَارِهِينَ﴾

దురహంకారులైన అతని జాతి నాయకులన్నారు: "ఓ షుఐబ్! మేము నిన్నూ మరియు నీతో పాటు విశ్వసించిన వారినీ, మా నరగం నుండి తప్పక వెడలగొడ్తాము.
లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి!" అతనన్నాడు: "మేము దానిని అసహ్యించుకున్నప్పటికీ (మీ ధర్మంలోకి చేరాలా)?"

﴿قَدِ افْتَرَيْنَا عَلَى اللَّهِ كَذِبًا إِنْ عُدْنَا فِي مِلَّتِكُمْ بَعْدَ إِذْ نَجَّانَا اللَّهُ مِنْهَا ۚ وَمَا يَكُونُ لَنَا أَنْ نَعُودَ فِيهَا إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّنَا ۚ وَسِعَ رَبُّنَا كُلَّ شَيْءٍ عِلْمًا ۚ عَلَى اللَّهِ تَوَكَّلْنَا ۚ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنْتَ خَيْرُ الْفَاتِحِينَ﴾

(ఇంకా ఇలా అన్నాడు): "వాస్తవంగా అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్ పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్ పైననే ఆధరపడి ఉన్నాము. 'ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతివారి మధ్య న్యాయంగా తీర్పు చేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు!"

﴿وَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ﴾

మరియు అతన జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు: "ఒకవేళ మీరు షుఐబ్ ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు."

﴿فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ﴾

అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు.

﴿الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَأَنْ لَمْ يَغْنَوْا فِيهَا ۚ الَّذِينَ كَذَّبُوا شُعَيْبًا كَانُوا هُمُ الْخَاسِرِينَ﴾

షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు.

﴿فَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا قَوْمِ لَقَدْ أَبْلَغْتُكُمْ رِسَالَاتِ رَبِّي وَنَصَحْتُ لَكُمْ ۖ فَكَيْفَ آسَىٰ عَلَىٰ قَوْمٍ كَافِرِينَ﴾

(షుఐబ్) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్యతిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి?"

﴿وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِنْ نَبِيٍّ إِلَّا أَخَذْنَا أَهْلَهَا بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَضَّرَّعُونَ﴾

మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భగ్యానికి గురి చేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని!

﴿ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتَّىٰ عَفَوْا وَقَالُوا قَدْ مَسَّ آبَاءَنَا الضَّرَّاءُ وَالسَّرَّاءُ فَأَخَذْنَاهُمْ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ﴾

ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: "వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి." కావున మేము వారిని ఆకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు.

﴿وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِمْ بَرَكَاتٍ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَٰكِنْ كَذَّبُوا فَأَخَذْنَاهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ﴾

మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే - మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి - సర్వశుభాల నొసంగి ఉండేవారం.
కాని వారు (ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము.

﴿أَفَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَنْ يَأْتِيَهُمْ بَأْسُنَا بَيَاتًا وَهُمْ نَائِمُونَ﴾

ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమన వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?

﴿أَوَأَمِنَ أَهْلُ الْقُرَىٰ أَنْ يَأْتِيَهُمْ بَأْسُنَا ضُحًى وَهُمْ يَلْعَبُونَ﴾

లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?

﴿أَفَأَمِنُوا مَكْرَ اللَّهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ﴾

ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు.

﴿أَوَلَمْ يَهْدِ لِلَّذِينَ يَرِثُونَ الْأَرْضَ مِنْ بَعْدِ أَهْلِهَا أَنْ لَوْ نَشَاءُ أَصَبْنَاهُمْ بِذُنُوبِهِمْ ۚ وَنَطْبَعُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَسْمَعُونَ﴾

ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాము, దాని వల్ల వారు (మా హితోపదేశాన్ని) వినలేకున్నారు.

﴿تِلْكَ الْقُرَىٰ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنْبَائِهَا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا مِنْ قَبْلُ ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الْكَافِرِينَ﴾

ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు. కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు.

﴿وَمَا وَجَدْنَا لِأَكْثَرِهِمْ مِنْ عَهْدٍ ۖ وَإِنْ وَجَدْنَا أَكْثَرَهُمْ لَفَاسِقِينَ﴾

మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే (ఫాసిఖీన్ గానే) పొందాము (చూశాము).

﴿ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَظَلَمُوا بِهَا ۖ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ﴾

ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు వాటి (మా సూచనల) పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి, దౌర్జన్యపరుల గతి ఏమయిందో!

﴿وَقَالَ مُوسَىٰ يَا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ﴾

మరియు మూసా అన్నాడు: "ఓ ఫిర్ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!

﴿حَقِيقٌ عَلَىٰ أَنْ لَا أَقُولَ عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ قَدْ جِئْتُكُمْ بِبَيِّنَةٍ مِنْ رَبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَنِي إِسْرَائِيلَ﴾

"అల్లాహ్ ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను.
వాస్తవానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను, కావున ఇస్రాయీల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు."

﴿قَالَ إِنْ كُنْتَ جِئْتَ بِآيَةٍ فَأْتِ بِهَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ﴾

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే - నీవు సత్యవంతుడవే అయితే - దానిని తీసుకొనిరా!"

﴿فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُبِينٌ﴾

అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సుఅబాన్ గా) మారిపోయింది.

﴿وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ﴾

మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది.

﴿قَالَ الْمَلَأُ مِنْ قَوْمِ فِرْعَوْنَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ﴾

(ఇది చూసి), ఫిర్ఔన్ జాతి నాయకులు అన్నారు: "నిశ్చయంగా, ఇతడు నేర్పు గల ఒక గొప్ప మాంత్రికుడు!"

﴿يُرِيدُ أَنْ يُخْرِجَكُمْ مِنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ﴾

(ఫిర్ఔన్ అన్నాడు): "ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడల గొట్ట గోరుతున్నాడు. అయితే! మీ సలహా ఏమిటి?"

﴿قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَأَرْسِلْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ﴾

వారన్నారు: "అతనికి (మూసాకు) మరియు అతని సోదరునికి కొంత వ్యవధి నిచ్చి, అన్ని నగరాలకు బంటులను పంపు.

﴿يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ﴾

"వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకొని వస్తారు."

﴿وَجَاءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوا إِنَّ لَنَا لَأَجْرًا إِنْ كُنَّا نَحْنُ الْغَالِبِينَ﴾

మరియు మాంత్రికులందరూ ఫిర్ఔన్ వద్దకు వచ్చి: "ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా!" అని అన్నారు.

﴿قَالَ نَعَمْ وَإِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِينَ﴾

(ఫిర్ఔన్) అన్నాడు: "అవును, నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు."

﴿قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَنْ تُلْقِيَ وَإِمَّا أَنْ نَكُونَ نَحْنُ الْمُلْقِينَ﴾

వారన్నారు: "ఓ మూసా! (ముందు) నీవు విసురుతావా? లేక మేము విసరాలా?"

﴿قَالَ أَلْقُوا ۖ فَلَمَّا أَلْقَوْا سَحَرُوا أَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوهُمْ وَجَاءُوا بِسِحْرٍ عَظِيمٍ﴾

(మూసా) అన్నాడు: "(ముందు) మీరే విసరండి!" వారు (తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు.

﴿۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَلْقِ عَصَاكَ ۖ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ﴾

మేము మూసాకు: "నీ చేతికర్రను విసురు." అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగి వేసింది.

﴿فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوا يَعْمَلُونَ﴾

ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది.

﴿فَغُلِبُوا هُنَالِكَ وَانْقَلَبُوا صَاغِرِينَ﴾

ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు.

﴿وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ﴾

మరియు మాంత్రికులు సాష్టాంగ పడ్డారు.

﴿قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ﴾

(మాంత్రికులు) అన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము.

﴿رَبِّ مُوسَىٰ وَهَارُونَ﴾

మూసా మరియు హారున్ ల ప్రభువును."

﴿قَالَ فِرْعَوْنُ آمَنْتُمْ بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ﴾

ఫిర్ఔన్ అన్నాడు: "నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు.

﴿لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُمْ مِنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ﴾

"నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను."

﴿قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنْقَلِبُونَ﴾

వారు ఇలా జవాబిచ్చారు: "నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది!

﴿وَمَا تَنْقِمُ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِآيَاتِ رَبِّنَا لَمَّا جَاءَتْنَا ۚ رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ﴾

మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! నీవు మాతో పగతీర్చుకోదలచావు." (ఇలా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మాకు సహనమొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందేటట్లు చేయి!"

﴿وَقَالَ الْمَلَأُ مِنْ قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ﴾

మరియు ఫిర్ఔన్ జాతి నాయకులు అతనితో అన్నారు: "ఏమీ? భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచి పోవటానికి, నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా?" అతడు (ఫిర్ఔన్) జవాబిచ్చాడు: "మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము."

﴿قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اسْتَعِينُوا بِاللَّهِ وَاصْبِرُوا ۖ إِنَّ الْأَرْضَ لِلَّهِ يُورِثُهَا مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ﴾

మూసా తన జాతి వారితో అన్నాడు: "అల్లాహ్ సహాయం కోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్ దే! ఆయన తన దాసులలో, తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు. మరియు అంతిమ (సాఫల్యం) దైవభీతి గలవారిదే!"

﴿قَالُوا أُوذِينَا مِنْ قَبْلِ أَنْ تَأْتِيَنَا وَمِنْ بَعْدِ مَا جِئْتَنَا ۚ قَالَ عَسَىٰ رَبُّكُمْ أَنْ يُهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِي الْأَرْضِ فَيَنْظُرَ كَيْفَ تَعْمَلُونَ﴾

(మూసా జాతివారు) అన్నారు: "నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించబడ్డాము!" (మూసా) జవాబిచ్చాడు: "మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ఖలీఫాలుగా చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు?"

﴿وَلَقَدْ أَخَذْنَا آلَ فِرْعَوْنَ بِالسِّنِينَ وَنَقْصٍ مِنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ﴾

మరియు వాస్తవానికి, మేము ఫిర్ఔన్ జాతి వారిని - బహుశా వారికి తెలివి వస్తుందేమోనని - ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము.

﴿فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ ۖ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَنْ مَعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِنْدَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ﴾

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు.
కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు.

﴿وَقَالُوا مَهْمَا تَأْتِنَا بِهِ مِنْ آيَةٍ لِتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ﴾

మరియు వారు (మూసాతో) అన్నారు: "నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము!"

﴿فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُجْرِمِينَ﴾

కావున మేము వారిపై జలప్రళయం (తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి.

﴿وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوا يَا مُوسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۖ لَئِنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِي إِسْرَائِيلَ﴾

మరియు వారిపైకి ఆపద వచ్చినపుడు వారనేవారు: "ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాయీల్ సంతతి వారిని తప్పక నీ వెంట పంపుతాము."

﴿فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ إِلَىٰ أَجَلٍ هُمْ بَالِغُوهُ إِذَا هُمْ يَنْكُثُونَ﴾

కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే - ఆ కాలానికి వారు చేరుకోవలసిన వారే కాబట్టి - వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు!

﴿فَانْتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ فِي الْيَمِّ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ﴾

కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచి వేశాము; ఎందుకంటే! వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్టకుండా ఉన్నారు.

﴿وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الْأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَا ۖ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنَىٰ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ بِمَا صَبَرُوا ۖ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهُ وَمَا كَانُوا يَعْرِشُونَ﴾

మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడేవారిని మేము శుభాలతో నింపిన, ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము.
ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయీల్ సంతతి వారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం, వారు ఓర్పు వహించి నందుకు పూర్తయింది.
మరియు ఫిర్ఔన్ మరియు అతని జాతి వారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనం చేశాము.

﴿وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتَوْا عَلَىٰ قَوْمٍ يَعْكُفُونَ عَلَىٰ أَصْنَامٍ لَهُمْ ۚ قَالُوا يَا مُوسَى اجْعَلْ لَنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ ۚ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ﴾

మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు (నడుస్తూ) తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వద్దకు చేరారు. వారన్నారు: "ఓ మూసా! వీరి ఆరాధ్య దైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు." (దానికి మూసా) జవాబిచ్చాడు: "నిశ్చయంగా, మీరు జ్ఞానహినులైన జాతికి చెందినవారు."

﴿إِنَّ هَٰؤُلَاءِ مُتَبَّرٌ مَا هُمْ فِيهِ وَبَاطِلٌ مَا كَانُوا يَعْمَلُونَ﴾

"నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు (విగ్రహారాధన చేస్తున్నందుకు) నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్థకమైనదే."

﴿قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ﴾

(మూసా ఇంకా) ఇలా అన్నాడు: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే (మీకాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా!"

﴿وَإِذْ أَنْجَيْنَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ ۖ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُمْ بَلَاءٌ مِنْ رَبِّكُمْ عَظِيمٌ﴾

మరియు మేము మిమ్మల్ని ఫిర్ఔన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర బాధకు గురిచేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి, మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది.

﴿۞ وَوَاعَدْنَا مُوسَىٰ ثَلَاثِينَ لَيْلَةً وَأَتْمَمْنَاهَا بِعَشْرٍ فَتَمَّ مِيقَاتُ رَبِّهِ أَرْبَعِينَ لَيْلَةً ۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَارُونَ اخْلُفْنِي فِي قَوْمِي وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ الْمُفْسِدِينَ﴾

మరియు మేము మూసా కొరకు (సినాయి కొండపై) ముప్పై రాత్రుల (గడువు) నిర్ణయించాము. తరువాత పది (రాత్రులు) పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన నలభై రాత్రుల గుడువ పూర్తయ్యింది.
మూసా తన సోదరుడగు హారూన్ తో అన్నాడు: "నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిథ్యం వహించు మరియు సంస్కరణకు పాటు పడు మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు."

﴿وَلَمَّا جَاءَ مُوسَىٰ لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنْظُرْ إِلَيْكَ ۚ قَالَ لَنْ تَرَانِي وَلَٰكِنِ انْظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي ۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا ۚ فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ﴾

మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు).
నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: "నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు.
తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను."

﴿قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُنْ مِنَ الشَّاكِرِينَ﴾

(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు."

﴿وَكَتَبْنَا لَهُ فِي الْأَلْوَاحِ مِنْ كُلِّ شَيْءٍ مَوْعِظَةً وَتَفْصِيلًا لِكُلِّ شَيْءٍ فَخُذْهَا بِقُوَّةٍ وَأْمُرْ قَوْمَكَ يَأْخُذُوا بِأَحْسَنِهَا ۚ سَأُرِيكُمْ دَارَ الْفَاسِقِينَ﴾

మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: "వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ ల) నివాసాన్ని మీకు చూపుతాను."

﴿سَأَصْرِفُ عَنْ آيَاتِيَ الَّذِينَ يَتَكَبَّرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَإِنْ يَرَوْا كُلَّ آيَةٍ لَا يُؤْمِنُوا بِهَا وَإِنْ يَرَوْا سَبِيلَ الرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًا وَإِنْ يَرَوْا سَبِيلَ الْغَيِّ يَتَّخِذُوهُ سَبِيلًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ﴾

ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్ ను) చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు.
ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు.

﴿وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ حَبِطَتْ أَعْمَالُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ﴾

మరియు మా సూచనలను (ఆయాత లను) మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా!

﴿وَاتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِنْ بَعْدِهِ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَهُ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ اتَّخَذُوهُ وَكَانُوا ظَالِمِينَ﴾

మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది.
ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు.

﴿وَلَمَّا سُقِطَ فِي أَيْدِيهِمْ وَرَأَوْا أَنَّهُمْ قَدْ ضَلُّوا قَالُوا لَئِنْ لَمْ يَرْحَمْنَا رَبُّنَا وَيَغْفِرْ لَنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ﴾

మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు: "మా ప్రభువు మమ్మల్ని కరుణించి, మమ్మల్ని క్షమించక పోతే మేము తప్పక నాశనం అయ్యే వారమే!"

﴿وَلَمَّا رَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا قَالَ بِئْسَمَا خَلَفْتُمُونِي مِنْ بَعْدِي ۖ أَعَجِلْتُمْ أَمْرَ رَبِّكُمْ ۖ وَأَلْقَى الْأَلْوَاحَ وَأَخَذَ بِرَأْسِ أَخِيهِ يَجُرُّهُ إِلَيْهِ ۚ قَالَ ابْنَ أُمَّ إِنَّ الْقَوْمَ اسْتَضْعَفُونِي وَكَادُوا يَقْتُلُونَنِي فَلَا تُشْمِتْ بِيَ الْأَعْدَاءَ وَلَا تَجْعَلْنِي مَعَ الْقَوْمِ الظَّالِمِينَ﴾

మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి, తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు.
(హారూన్) అన్నాడు: "నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!"

﴿قَالَ رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي وَأَدْخِلْنَا فِي رَحْمَتِكَ ۖ وَأَنْتَ أَرْحَمُ الرَّاحِمِينَ﴾

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించే వారిలో అందరి కంటే అధికంగా కరుణించేవాడవు!"

﴿إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِنْ رَبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ﴾

ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము.

﴿وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِنْ بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُورٌ رَحِيمٌ﴾

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు.

﴿وَلَمَّا سَكَتَ عَنْ مُوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْوَاحَ ۖ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ﴾

మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి.

﴿وَاخْتَارَ مُوسَىٰ قَوْمَهُ سَبْعِينَ رَجُلًا لِمِيقَاتِنَا ۖ فَلَمَّا أَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُمْ مِنْ قَبْلُ وَإِيَّايَ ۖ أَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَاءُ مِنَّا ۖ إِنْ هِيَ إِلَّا فِتْنَتُكَ تُضِلُّ بِهَا مَنْ تَشَاءُ وَتَهْدِي مَنْ تَشَاءُ ۖ أَنْتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۖ وَأَنْتَ خَيْرُ الْغَافِرِينَ﴾

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని ఎన్నుకున్నాడు.
ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా (మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు.
ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు!"

﴿۞ وَاكْتُبْ لَنَا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ إِنَّا هُدْنَا إِلَيْكَ ۚ قَالَ عَذَابِي أُصِيبُ بِهِ مَنْ أَشَاءُ ۖ وَرَحْمَتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَالَّذِينَ هُمْ بِآيَاتِنَا يُؤْمِنُونَ﴾

"మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీ వైపునకే మరలాము." (అల్లాహ్) సమాధానం ఇచ్చాడు: "నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతి దానిని ఆవరించి ఉన్నది.
కనుక నేను దానిని దైవభీతి గలవారికీ, విధిదానం (జకాత్) ఇచ్చే వారికీ మరియు నా సూచనలను విశ్వసించే వారికీ వ్రాస్తాను!

﴿الَّذِينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا عِنْدَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنْجِيلِ يَأْمُرُهُمْ بِالْمَعْرُوفِ وَيَنْهَاهُمْ عَنِ الْمُنْكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ﴾

"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు.
కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."

﴿قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ بِاللَّهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ﴾

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!"

﴿وَمِنْ قَوْمِ مُوسَىٰ أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ﴾

మరియు మూసా జాతివారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని (సత్యం) ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం వారు ఉన్నారు.

﴿وَقَطَّعْنَاهُمُ اثْنَتَيْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا ۚ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ إِذِ اسْتَسْقَاهُ قَوْمُهُ أَنِ اضْرِبْ بِعَصَاكَ الْحَجَرَ ۖ فَانْبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَشْرَبَهُمْ ۚ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَأَنْزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ﴾

మరియు మేము వారిని పన్నెండు తెగలుగా (వర్గాలుగా) విభవించాము.
మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగినపుడు, మేము అతనిని: "నీ చేతికర్రతో రాయిపై కొట్టు!" అని ఆజ్ఞాపించాము. అపుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. అపుడు ప్రతి తెగవారు, తాము నీళ్ళు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్న మరియు సల్వాలను దింపాము: "మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి." అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు.

﴿وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ ۚ سَنَزِيدُ الْمُحْسِنِينَ﴾

మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): "ఈ నగరంలో నివసించి, అందులో మీ ఇష్టప్రకారం తినండి. మరియు : 'మా పాపాలను క్షమించు (హిత్తతున్), అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము)."

﴿فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ﴾

కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి, మరొకు మాటను ఉచ్ఛరించారు; కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము.

﴿وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُمْ بِمَا كَانُوا يَفْسُقُونَ﴾

మరియు సముద్ర తీరము నందున్న ఆ నగర (వాసులను) గురించి వారిని అడుగు; వారు శనివారపు (సబ్త్) ధర్మాన్ని ఉల్లంఘించేవారు! ఆ శనివారం (సబ్త్) రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు (సబ్త్) ధర్మం పాటించని రోజు (చేపలు) వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురిచేశాము.

﴿وَإِذْ قَالَتْ أُمَّةٌ مِنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ﴾

వారిలోని ఒక వర్గం వారు: "అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?" అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: "మీ ప్రభువు ముందు, (హింతబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గల వారు అవుతారేమోనని!"

﴿فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنْجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ﴾

తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠినశిక్షకు గురిచేశాము.

﴿فَلَمَّا عَتَوْا عَنْ مَا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ﴾

కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: "మీరు నీచమైన కోతులుగా మారండి." అని అన్నాము.

﴿وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ ۖ وَإِنَّهُ لَغَفُورٌ رَحِيمٌ﴾

మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి). నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

﴿وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُمْ بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ﴾

మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింప జేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము.

﴿فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا الْكِتَابَ يَأْخُذُونَ عَرَضَ هَٰذَا الْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِنْ يَأْتِهِمْ عَرَضٌ مِثْلُهُ يَأْخُذُوهُ ۚ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِمْ مِيثَاقُ الْكِتَابِ أَنْ لَا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ ۗ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ﴾

ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై, తుచ్ఛమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ: "మేము క్షమింపబడతాము." అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. "అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు.
" అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకో బడలేదా ఏమిటి? అందులో (గ్రంథంలో) ఉన్నదంతా వారు చదివారు కదా! మరియు దైభీతి గలవారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది, ఏమీ? మీరిది గ్రహించలేరా?

﴿وَالَّذِينَ يُمَسِّكُونَ بِالْكِتَابِ وَأَقَامُوا الصَّلَاةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ الْمُصْلِحِينَ﴾

మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము.

﴿۞ وَإِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَأَنَّهُ ظُلَّةٌ وَظَنُّوا أَنَّهُ وَاقِعٌ بِهِمْ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ﴾

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము (తూర్) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము: "మేము మీకు ఇచ్చిన దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు!"

﴿وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَنْ تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ﴾

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతి వారి వీపున నుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: "ఏమీ? నేను మీ ప్రభువును కానా?" అని అడుగగా! వారు: "అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము." అని జవాబిచ్చారు. తీర్పుదినమున మీరు: "నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము." అని అనగూడదని.

﴿أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِنْ بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ﴾

లేక: "వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాతముత్తాతలు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారం (కాబట్టి వారిని అనుసరించాము). అయితే? ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింప జేస్తావా?" అని అనగూడదని.

﴿وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ﴾

మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము.

﴿وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ الَّذِي آتَيْنَاهُ آيَاتِنَا فَانْسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ الشَّيْطَانُ فَكَانَ مِنَ الْغَاوِينَ﴾

మరియు మేము, మా సూచనలు (ఆయాత్) ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడై నందుకు షైతాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు.

﴿وَلَوْ شِئْنَا لَرَفَعْنَاهُ بِهَا وَلَٰكِنَّهُ أَخْلَدَ إِلَى الْأَرْضِ وَاتَّبَعَ هَوَاهُ ۚ فَمَثَلُهُ كَمَثَلِ الْكَلْبِ إِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ أَوْ تَتْرُكْهُ يَلْهَثْ ۚ ذَٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ﴾

మరియు మేము కోరుకుంటే వాటి (ఆ సూచనల) ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు.
అతని దృష్టాంతం ఆ కుక్క వలె ఉంది: నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదలి పెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది.
మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే! నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే, బహుశా వారు ఆలోచించవచ్చు!

﴿سَاءَ مَثَلًا الْقَوْمُ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَأَنْفُسَهُمْ كَانُوا يَظْلِمُونَ﴾

మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు.

﴿مَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِي ۖ وَمَنْ يُضْلِلْ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ﴾

అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో పడ నిచ్చినవారు! వారే నష్టపోయేవారు.

﴿وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِنَ الْجِنِّ وَالْإِنْسِ ۖ لَهُمْ قُلُوبٌ لَا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَا يَسْمَعُونَ بِهَا ۚ أُولَٰئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ ۚ أُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ﴾

మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము.
ఎందుకంటే! వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు; కాదు! వాటి కంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు.

﴿وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ﴾

మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.

﴿وَمِمَّنْ خَلَقْنَا أُمَّةٌ يَهْدُونَ بِالْحَقِّ وَبِهِ يَعْدِلُونَ﴾

మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారునూ మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారునూ ఉన్నారు.

﴿وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ﴾

మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారిని, మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా (నాశనం వైపునకు) తీసుకుపోతాము.

﴿وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ﴾

మరియు నేను వారికి వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది.

﴿أَوَلَمْ يَتَفَكَّرُوا ۗ مَا بِصَاحِبِهِمْ مِنْ جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ مُبِينٌ﴾

ఏమీ? తన సహచరుడు పిచ్చి పట్టిన వాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసేవాడు మాత్రమే!

﴿أَوَلَمْ يَنْظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ وَأَنْ عَسَىٰ أَنْ يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ﴾

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?

﴿مَنْ يُضْلِلِ اللَّهُ فَلَا هَادِيَ لَهُ ۚ وَيَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ﴾

అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు! మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడుతున్నాడు.

﴿يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّي ۖ لَا يُجَلِّيهَا لِوَقْتِهَا إِلَّا هُوَ ۚ ثَقُلَتْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا تَأْتِيكُمْ إِلَّا بَغْتَةً ۗ يَسْأَلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنْهَا ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِنْدَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ﴾

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: "అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: "నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: "నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు."

﴿قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنْتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِقَوْمٍ يُؤْمِنُونَ﴾

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు.
నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!"

﴿۞ هُوَ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَتْ دَعَوَا اللَّهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ﴾

ఆయనే, మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను (జౌజను) పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నపుడు, ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది.
పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకుంటారు: "నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము!"

﴿فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ﴾

ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు.

﴿أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ﴾

ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా?

﴿وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنْفُسَهُمْ يَنْصُرُونَ﴾

మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు. మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.

﴿وَإِنْ تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَتَّبِعُوكُمْ ۚ سَوَاءٌ عَلَيْكُمْ أَدَعَوْتُمُوهُمْ أَمْ أَنْتُمْ صَامِتُونَ﴾

మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక మౌనం వహించినా మీకు సమానమే!

﴿إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ﴾

నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు వారిని పిలువండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి.

﴿أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنْظِرُونِ﴾

ఏమీ? వారికి కాళ్ళున్నాయా, వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా, వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళున్నాయా, వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా, వాటిలో వినటానికి? వారితో అను: "మీరు సాటి కల్పించిన వారిని (భాగస్వాములను) పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు (వ్యూహాలు) పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి.

﴿إِنَّ وَلِيِّيَ اللَّهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ﴾

నిశ్చయంగా, ఈ గ్రంథాన్ని అవతరింప జేసిన అల్లాహ్ యే నా సంరక్షకుడు, ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు.

﴿وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ لَا يَسْتَطِيعُونَ نَصْرَكُمْ وَلَا أَنْفُسَهُمْ يَنْصُرُونَ﴾

మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.

﴿وَإِنْ تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا ۖ وَتَرَاهُمْ يَنْظُرُونَ إِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُونَ﴾

మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీవైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు.

﴿خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ﴾

మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవకు.

﴿وَإِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ ۚ إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ﴾

మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్ శరణు వేడుకో! నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

﴿إِنَّ الَّذِينَ اتَّقَوْا إِذَا مَسَّهُمْ طَائِفٌ مِنَ الشَّيْطَانِ تَذَكَّرُوا فَإِذَا هُمْ مُبْصِرُونَ﴾

వాస్తవానికి, దైవభీతి గలవారు తమకు షైతాన్ నుండి కలత గలిగితే! వారు (అల్లాహ్ ను) స్మరిస్తారు, అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు.

﴿وَإِخْوَانُهُمْ يَمُدُّونَهُمْ فِي الْغَيِّ ثُمَّ لَا يُقْصِرُونَ﴾

మరియు వారి (షైతాన్ ల) సహోదరులు వారిని తప్పు దారి వైపుకు లాక్కొని పోగోరుతారు మరియు వారు ఏ మాత్రం పట్టు వదలరు.

﴿وَإِذَا لَمْ تَأْتِهِمْ بِآيَةٍ قَالُوا لَوْلَا اجْتَبَيْتَهَا ۚ قُلْ إِنَّمَا أَتَّبِعُ مَا يُوحَىٰ إِلَيَّ مِنْ رَبِّي ۚ هَٰذَا بَصَائِرُ مِنْ رَبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِقَوْمٍ يُؤْمِنُونَ﴾

మరియు (ఓ ప్రవక్తా!) నీవు వారికి ఏదైనా సూచనను తేలేక పోయినప్పుడు వారు: "నీవే స్వయంగా దానిని ఎందుకు (కల్పించుకొని) తేలేదు?" అని అంటారు.
వారితో ఇలా అను: "నేను కేవలం నా ప్రభువు తరఫు నుండి నాకు పంప బడే సందేశాన్ని (వహీని) మాత్రమే అనుసరించేవాడను.
ఇందు (ఈ ఖుర్ఆన్) లో విశ్వసించేవారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి."

﴿وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنْصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ﴾

మరియు ఖుర్ఆన్ పారాయణం జరిగేటప్పుడు దానిని శ్రద్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, అప్పుడు మీరు కరుణింపబడవచ్చు!

﴿وَاذْكُرْ رَبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعًا وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْآصَالِ وَلَا تَكُنْ مِنَ الْغَافِلِينَ﴾

మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గు స్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసేవారిలో చేరకు.

﴿إِنَّ الَّذِينَ عِنْدَ رَبِّكَ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَيُسَبِّحُونَهُ وَلَهُ يَسْجُدُونَ ۩﴾

నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు.

الترجمات والتفاسير لهذه السورة: